Header Banner

'ఎస్ఎస్ఎంబీ 29'పై ఒడిశా డిప్యూటీ సీఎం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌! మ‌హేశ్-రాజ‌మౌళి కాంబోలో తొలి చిత్రం..

  Thu Mar 13, 2025 14:51        Entertainment

టాలీవుడ్‌ ద‌ర్శక‌ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో ఒక మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. 'ఎస్ఎస్ఎంబీ 29' అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత జ‌క్క‌న్న తీస్తున్న‌ సినిమా కావ‌డం, అటు మ‌హేశ్-రాజ‌మౌళి కాంబోలో తొలి చిత్రం కావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే, ఈ మూవీ షూటింగ్‌పై తాజాగా ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరగడం రాష్ట్రానికి గర్వకారణమని, ఇది స్థానిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రాన్ని సినిమా షూటింగ్‌లకు ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తుందని ఆమె ట్వీట్ చేశారు. 

 

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై సీఎం క్లారిటీ! ఏప్రిల్‌ నెలలో మూడు రోజుల పాటు..

 

"గతంలో మల్కాన్‌గిరిలో 'పుష్ప-2' షూటింగ్ జరిగినట్లే.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రాబోయే చిత్రం 'ఎస్ఎస్ఎంబీ 29' కోసం కోరాపుట్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇది ఒడిశా పర్యాటక రంగానికి మంచి అవ‌కాశం లాంటింది. ఈ చిత్ర షూటింగ్ వ‌ల్ల భ‌విష్య‌త్‌లో ఒడిశా సినిమా షూటింగ్‌ల‌తో పాటు ప‌ర్యాట‌క‌రంగానికి ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుంది. మా దగ్గర షూటింగ్స్ చేసేందుకు అన్ని భాషల‌ ఇండస్ట్రీలను స్వాగతిస్తున్నాం. షూటింగ్‌లకు పూర్తి మద్దతు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నాం" అంటూ ఒడిశా డిప్యూటీ సీఎం త‌న 'ఎక్స్' పోస్టులో రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భ‌లేదొంగ‌లు.. ఎత్తుకెళ్లిందెంటో తెలిస్తే షాక‌వ్వాల్సిందే.. ఏక కాలంలో ఇలా.!

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SSMB29 #PravatiParida #Odisha #Rajamouli #MaheshBabu #Tollywood